Monday 15 September 2014

సాగర్ కు పెరిగిన పర్యాటకుల తాకిడి

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జున సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా వచ్చి చేరుతున్న వరద నీటితో సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. నీటిమట్టం 590 అడుగులకు చేరడంతో అధికారులు 8 గేట్లు ఓపెన్ చేశారు. క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి లక్షా 22 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లో తట్టు ప్రాంతాలైన మేళ్లచెరువు, మఠంపల్లి, దామరచర్ల మండలాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ఉధృతి ప్రమాదకరంగా ఉండటంతో చేపలవేటను నిషేధించారు. నదిలోకి దిగొద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. మరోవైపు సాగర్ గేట్లు ఎత్తేయడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది.

No comments:

Post a Comment