Monday 15 September 2014

తొలిసారి డీజిల్ ధరలు తగ్గే సూచనలు

ఏడేళ్ల తర్వాత తొలిసారి డీజిల్ ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడంతో చమురు కంపెనీలు డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉంది. 2013 జూన్ లో 115 డాలర్లున్న క్రూడాయిల్ ధర ప్రస్తుతం 96.72 డాలర్లకు పడిపోయింది. అటు 2013 జనవరి నుంచి ప్రతి నెలా 50 పైసల చొప్పున... 19 సార్లు డీజిల్ ధరలు పెరిగాయి. కాగా డీజిల్ ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం కూడా తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

No comments:

Post a Comment