Sunday 14 September 2014

రెస్టారెంట్‌లోకి రానీయలేదు: అత్యాచార బాధితురాలు

కోల్‌కతా: అత్యాచార బాధితురాలిననే కారణంతో కోల్‌కతాలోని రెస్టారెంట్ తనకు అనుమతి నిరాకరించిందని 2012లో నగరంలో నడుస్తున్న కారులో అత్యాచారానికి గురైన ఆంగ్లో-ఇండియన్ మహిళ ఆదివారం ఆరోపించింది. అయితే ఆమె ఆరోపణలను ఆ రెస్టారెంట్ తోసిపుచ్చింది. దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న ‘జింజర్' బార్ అండ్ రెస్టారెంట్ తనకు అనుమతి నిరాకరించిందని ఆ 40 ఏళ్ల మహిళ ఆరోపించింది. ‘నేను పార్క్‌స్ట్రీట్ రేప్ బాధితురాలిని కాబట్టి నన్ను అనుమతించలేమని రెస్టారెంట్ యాజమాన్యం చెప్పింది. నన్ను లోపలికి అనుమతించవద్దని తమకు ఆదేశాలున్నాయని కూడా వాళ్లు చెప్పారు. అత్యాచారానికి గురవడం నా తప్పా? నేను మామూలు జీవితం గడపకూడదా?' అని ఆమె ప్రశ్నించింది. అయితే ఆమె గొడవ చేసే మనిషి కాబట్టే అనుమతించలేదని రెస్టారెంట్ యాజమాన్యం వాదిస్తోంది

No comments:

Post a Comment