Thursday 11 September 2014

పొగ తాగితే 20 వేల రూపాయల జరిమానా


public smoking kandireega.comదేశాన్ని అభివృద్ధి బాటలోనే కాక ఆరోగ్య బాటలో కూడా తీసుకెళ్ళే క్రమంలో భాజాపా ప్రభుత్వం కొత్త ప్రణాళికలను అమలు పరచడానికి సన్నాహాలు చేస్తోంది. భారత దేశాన్ని పొగాకు రహిత ప్రాంతంగా మార్చడానికి కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా, విడిగా సిగరెట్లు కొనడం, అమ్మడం, బహిరంగంగా పొగాకు తాగడం వంటి వాటిపై విధించే జరిమానాన్ని భారీ మొత్తంలో పెంచనుంది.
ఇటీవలే సిగరెట్ల ధరలను భారీగా పెంచినకేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సూచనల మేరకు భాజాపా ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయానికి త్వరలోనే శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. బహిరంగంగా సిగరెట్టు తాగితే 20 వేల రూపాయలు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ మేరకు సూచనలు చేశారని తెలుస్తోంది. సిగరెట్టు తాగే వయసు కూడా 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళకు పెంచాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
అంతే కాకుండా… సిగరెట్టు ప్యాకెట్టు మీద బొమ్మతో సహా లీగల్ వార్గింగ్స్ ని ముద్రించని యెడల ఇదివరకు విధించే రూ. 5 వేల రూపాయలను ఇప్పుడు రూ. 50 వేల రూపాయలుగా పెంచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రతిపాదలన్నిటికీ కేంద్ర మంత్రి వర్గం నుంచి ఆమోదం రావాల్సి ఉంది. వారి అంగీకరించే నేపథ్యంలో పొగరాయుళ్ళకు సెగేనని పరిశీలకులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment