Friday 12 September 2014

అమెరికాలో మోడీకి భారీ రిసెప్షన్: హోస్ట్‌గా నీనా..20వేల మంది?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ప్రతిష్టాత్మకం కానుంది. ఇప్పటికే అమెరికాలోని ఒబామా సర్కారుతో పాటు, అక్కడి భారతీయ వర్గాలు మోడీ టూర్‌ను సక్సెస్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. 
 
ఇందులో భాగంగా మోడీ కోసం అమెరికాలోని భారతీయులు ఓ భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హోస్టులుగా 'మిస్ అమెరికా 2014' నీనా దావులూరి, అమెరికాలో సుప్రసిద్ధ టీవీ యాంకర్ హరి శ్రీనివాసన్ (పీబీఎస్ చానల్) వ్యవహరించనున్నారు. 
 
న్యూయార్క్‌లోని సుప్రసిద్ధ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఈ నెల 28న నిర్వహించే ఈ భారీ రిసెప్షన్‌కు 20,000 మంది ఇండియన్ - అమెరికన్లు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 

No comments:

Post a Comment