Tuesday 16 September 2014

ప్రాణహాని ఉంటే 1+1 సెక్యూరిటీ భద్రత కల్పిస్తారా? : జగన్ ప్రశ్న

తనకు తన కుటుంబానికి ప్రాణ హాని ఉంటే 1+1 సెక్యూరిటీని మాత్రమే కల్పిస్తారా అని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని, అలాంటపుడు తనకు కేటాయించిన జెడ్ కేటగిరి భద్రతను తొలగించడం అన్యాయమన్నారు. తనకున్న జెడ్ కేటగిరి భద్రత (6+6)ను తొలిగించి.. వ్యక్తిగత భద్రత సిబ్బంది (1+1), (1+1) ముఖ్య భద్రతాధికారిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. 
 
గత మూడేళ్ల నుంచి తనకు కొనసాగిస్తూ వచ్చిన జెడ్ కేటగిరి భద్రతను యధాతథంగా కొనసాగించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, ఏపి డిజిపి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, కడప జిల్లా ఎస్పీ, రాష్ట్రస్థాయి భద్రత సమీక్ష కమిటీలను జగన్ తన పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

1 comment: