Tuesday 16 September 2014

కాంగ్రెస్ భయపడదు..భయపడేది లేదు - పొన్నాల..

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ భయపడదు..భయపడేది లేదని పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం చెందడంపై ఆయన గాంధీభవన్ లో పొన్నాల విలేకరులతో మాట్లాడారు. పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. ఓడిపోయినంత మాత్రాన భయపడేది లేదని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని, ఇందులో రాజీ పడేది లేదని తెలిపారు. మెదక్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నికల ప్రచారం నిర్వహించారని, అర్థబలం, అంగ బలం, అధికార బలం ఉందన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్..ఆంధ్రలో టిడిపి..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాయని, అందులో ప్రభుత్వంలో ఉన్న రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్నారు. గతంలో సిపిఐ, ఎంఐఎం కాంగ్రెస్ తో అవగాహన కుదిరితే ఈసారి సిపిఐ, సిపిఎం, ఎంఐఎం మూడు కూడా అధికార పక్షమైన టిఆర్ఎస్ తో కలిసాయని తెలిపారు. వారి విధానాలను వ్యతిరేకిస్తూనే పొత్తు పెట్టుకున్నాయని, టిడిపి బిజెపికి మద్దతు పలకడం..ఆ తరువాత మాదిగ దండోర మద్దతివ్వడం..అయినా బిజెపి..కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అరువుగా తెచ్చుకున్నారని విమర్శించారు. మూడు దఫాలుగా ఆ ప్రాంతంలో టిఆర్ఎస్ విజయం సాధించిందని, ఇది ఎన్నిక ఫలితాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజల పక్షాల వాదన వినిపించిందని, పార్టీ మరింత బలోపేతం చేయడానికి అధిష్టాన నిర్ణాయాలు..ఆదేశాలు..కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తానని పొన్నాల పేర్కొన్నారు.

No comments:

Post a Comment