Thursday 16 October 2014

సింహాద్రి విద్యుత్ రాకనే తెలంగాణలో ఇక్కట్లు...చర్చకు సై : కేసీఆర్

power crisisతుఫాను కారణంగా విశాఖపట్నంలోని 2 వేల మెగావాట్ల సింహాద్రి విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిచిపోవడంతో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఆగిపోయిందని, ఫలితంగా తెలంగాణాలో కరెంట్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోవడం మరింత ఇబ్బందికరంగా మారిందన్నారు. 
 
విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో గురువారం సమీక్షించారు. గత ఏడాది కంటే ఈ సారి విద్యుత్ డిమాండ్ 32.54 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. 143 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఇదే సమయంలో డిమాండ్ 126 మిలియన్ యూనిట్లు ఉంటే.. 122 మిలియన్ యూనిట్లు సరఫరా చేశారని తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. జల విద్యుత్ ఉత్పత్తిని సాధ్యమైనంత మేరకు పెంచి, పంటలను ఆదుకునే యత్నం చేస్తున్నామని చెప్పారు. సింహాద్రి ప్రాజెక్టులో గురువారం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని, మిగతా ఉత్పత్తి ప్రారంభమైతే పరిస్థితి మెరుగుపడుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధరతో సంబంధం లేకుండా ఎక్కడ విద్యుత్ లభిస్తే.. అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా ఇస్తే.. తెలంగాణలో వ్యవసాయానికి మరికొంత విద్యుత్ ఇవ్వడం సాధ్యమవుతుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. 

No comments:

Post a Comment