Wednesday 8 October 2014

తెలంగాణలో షర్మిల పరామర్శ యాత్ర

హైదరాబాద్, అక్టోబర్ 8: ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిందని, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వంపై వచ్చే నాలుగేళ్లలో ప్రజావ్యతిరేకత ఎగసిపడుతుందని, ఈ రెండు ప్రభుత్వాలు కొట్టుకుపోతాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన తెలంగాణ రాష్ట్ర స్ధాయి వైకాపా విస్తృతస్ధాయి సమావేశంలో ఆయనతోపాటు సోదరి షర్మిల, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ షర్మిలకు తెలంగాణలో పార్టీని గ్రామస్ధాయి నుంచి పటిష్టం చేసే బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ వర్కింగ్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్‌ఆర్ అభిమానులు తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నారని, వైఎస్ మరణ వార్త విని మనోవేదనతో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు షర్మిల పరామర్శ పేరుతో యాత్ర చేపడుతుందన్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలపై జగన్ దుమ్మెత్తిపోశారు. భవిష్యత్తులో తెలంగాణలో వైకాపా, బిజెపి, కాంగ్రెస్ పార్టీలే రాజకీయంగా మనుగడలో ఉంటాయని జోస్యం చెప్పారు. తెలుగు భాష తెలియని సోనియాగాంధీ, ఈ భాష మాట్లాడలేని నరేంద్రమోదీకే తెలంగాణను పరిపాలించాలని ఉన్నప్పుడు తెలుగు భాష తెలిసి, ఇక్కడే పుట్టిన తామెందుకు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడరాదన్నారు. కొమురం భీంను ఆదర్శంగా తీసుకుని తమ పార్టీ పోరాడుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. చంద్రబాబు మాటలను విశ్వసించడం మానివేశారన్నారు. ఇక్కడ టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందన్నారు. కెసిఆర్ అంటే వ్యతిరేకత ఒక ఏడాదిలో ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతానికి బలమైన నేతలు పార్టీలో లేకపోయిననా, యుద్ధంలో పోరాడేందుకు అవసరమైన గుండె ధైర్యం తనకు, పార్టీ కార్యకర్తలకు ఉందన్నారు. షర్మిల మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని, ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్‌కు బలమైన స్ధానం ఉందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, 1200 కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. తాను త్వరలో జనంలోకి వస్తానన్నారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీని పటిష్టం చేసేందుకు శాయశక్తులా శ్రమించి పనిచేస్తానన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.
చిత్రం.. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి
వైకాపా విస్తృతస్ధాయి సమావేశంలో పాల్గొన్న జగన్, షర్మి

No comments:

Post a Comment