Thursday 16 October 2014

తుపాను బాధితుల కోసం ఎమ్మెల్యే భిక్షాటన

అనంతపురం: హుధుద్ తుఫాన్‌తో దెబ్బ తిన్న విశాఖపట్నం, శ్రీకాకుళం వాసులను ఆదుకునేందుకు తన వంతు కర్తవ్యంగా శాసనసభ్యుడు గోనుగుంట్ల సూర్యనారాయణ నియోజకవర్గం నాయకులు, మున్సిపల్ చైర్మన్, ఎంపిపి తదితరులతో కలసి బుధవారం పట్టణంలో భిక్షాటన చేశారు. తొలుత గాంధీనగర్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి భిక్షాటన ప్రారంభించారు. ఆయనను ప్రజలు సాదరంగా ఆహ్వానించి తమకు తోచిన ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భిక్షాటన కార్యక్రమం స్థానిక గాంధీనగర్ నుండి ఎన్టీఆర్ సర్కిల్, అంజుమన్ సర్కిల్, తేరుబజార్, కళాజ్యోతి సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ మీదు గా సాగింది. మరోవైపు మున్సిపల్ చైర్మన్ బీరే గోపాలకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్‌చైర్మన్ అంబారపు శ్రీనివాసులుతో కలసి భిక్షాటన చేశ రు. తుపాన్ ప్రభావం విశాఖ, శ్రీకాకుళం జిల్లాలను తుడిచిపెట్టేసిందని, దీంతో ఎందరో నిరాశ్రయులయ్యారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని శాసనశభ్యుడు సూర్యనారాయణ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి క్లిష్ట సమయంలో వారిని ఆదుకుని తమ ఉదారత చాటాలన్నారు. కౌన్సిలర్లనుద్దేశించి మాట్లాడుతూ పట్టణంలోని 40 వార్డులలో కౌన్సిలర్లు భిక్షాటన చేయాలని ఎవరు ఎక్కువ మొత్తాన్ని సేకరించగలిగితే వారికి ప్రోత్సాహక బహుమతి అందజేస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో గ్రామస్థాయి నుండి నాయకులు భిక్షాటన చేసి వసూలయ్యే మొత్తాన్ని వరదబాధితుల సహాయార్థం పంపేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వరద బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకుందామని ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం అధికారులు, కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆ విజ్ఞప్తి చేశఆరు రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యాయరని, వారిని ఆదుకోవడంలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కౌన్సిలర్ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అపర్ణ రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అదే విధంగా కౌన్సిలర్ కృపాకర్ రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో పాటు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులు ఒక నెల వేతనం రూ, 1800 ప్రకటించారు. దీంతో పాటు మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు ఆర్థిక సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. హుధుద్ తుపాను వరదబాధితుల సహాయార్థం బుధవారం అనంతపురం మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న, కార్పొరేటర్లు నగరంలో విరాళాలు సేకరించారు. కార్పొరేటర్లు హుండీలు పట్టుకుని ప్రతి షాపువద్దకు వెళ్ళి విరాళాలు సేకరించారు. తొలుత కార్పొరేషన్ కార్యాలయం నుంచి విరాళాల సేకరణ ప్రారంభమైంది. సిబ్బంది హుండీలో తమ వంతు సహకారంగా విరాళాలు వేశారు. తిరిగి సాయంకాలం సైతం మేయర్, కార్పొరేటర్లు ఉత్సాహంగా విరాళాల సేకరణ జరిపారు.

No comments:

Post a Comment