Wednesday 8 October 2014

నేడు చంద్రగ్రహణం.. సాయంత్రం 4.45 గంటల నుంచి రాత్రి 7.05 వరకు...

చంద్రగ్రహణం నేడు దేశ వ్యాప్తంగా కనిపించనుంది. చంద్రగ్రహణం ఘడియలు సాయంత్రం 4.45 గంటల నుంచి రాత్రి 7.05 వరకు ఉంటాయి. సాధారణంగా గ్రహణానికి ఆరు గంటల ముందు నుంచే ఆలయాల తలుపులు మూసివేయడం ఆనవాయతీగా వస్తోంది. దీంతో శ్రీకాళహస్తి ఆలయం మినహా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేశారు. 
moon eclipse 
ఈ క్రమంలో బుధవారం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం తలుపులు మూసివేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఉదయం 10 గంటల నుంచి మూసివేశారు. శుద్ధి కార్యక్రమాల తర్వాత రాత్రి 9 గంటలకు భక్తుల దర్శనార్థం తలుపులు తెరుస్తారు. 
 
అలాగే విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ఉదయం 10 గంటల నుంచి గురువారం వేకువజాము 4 గంటల వరకు మూసివేస్తారు. యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మధ్యాహ్నం 12.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూసి ఉంచుతారు. బాసరలోని సరస్వతీదేవి ఆలయాన్ని ఈ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేస్తారు
 
బుధవారం ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణంపై భూ అధ్యయన శాస్త్ర మంత్రిత్వ శాఖ వివరాల మేరకు.. మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం సాయంత్రం 6.05 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది. ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. చంద్రోదయం సమయంలో మన దేశంలోని పశ్చిమ ప్రాంతం వారికి మినహా మిగిలిన అన్ని ప్రాంతాల వారికి గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. అయితే, గ్రహణం వీడే సమయంలో మాత్రం దేశంలోని పలు ప్రాంతాల వారు చూసే అవకాశం లభిస్తుందని తెలిపింది. 

No comments:

Post a Comment