Thursday 9 October 2014

హీరో మోహన్‌ బాబుకు కారు ప్రమాదం ఎలా జరిగిందంటే....

mohan babu
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో మోహన్‌ బాబు ప్రయాణిస్తున్న కారును మాదాపూర్‌లోని విఠల్‌రావునగర్‌లో గుర్తు తెలియని క్యాబ్‌ కారు ఢీ కొట్టింది. దీంతో ఆయన ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో మోహన్‌బాబుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. 
 
సంఘట అనంతరం ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మాదాపూర్‌ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కొద్ది సేపటికి మాదాపూర్‌ పోలీసులకు ఫోన్‌ చేసి తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని మోహన్‌బాబు తెలిపారు. 
 
అయితే ఈ ప్రమాదం జరగడానికి గుర్తు తెలియని క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మోహన్ బాబు కారు డ్రైవర్ చెపుతున్నాడు. మితిమీరిన వేగంతో వచ్చిన క్యాబ్ ఒక్కసారిగా తమ కారును ఢీకొట్టగా, తాను అప్రమత్తమై ప్రమాద తీవ్రతను కొంతమేరకు తగ్గించగలిగినట్టు వివరించాడు. 

No comments:

Post a Comment