Wednesday 15 October 2014

హైదరాబాద్‌ పోలీస్ బాస్‌గా పదేళ్ళ సాధిక్

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పదేళ్ళ బాలుడు సాధిక్‌కి ఒక కోరిక వుంది. అది.. హైదరాబాద్ నగరానికి పోలీస్ కమిషనర్ కావాలని. మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా ఆ బాలుడి కోరికను తెలుసుకున్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఆ బాలుడి కోరికను నెరవేర్చారు. బుధవారం ఉదయం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సాధిక్ బాద్యతలు స్వీకరించాడు. ఆ సమయంలో ఆ బాలుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తీవ్ర అనారోగ్యంతో వున్న తన కుమారుడి కోరిక నెరవేర్చినందుకు పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి సాధిక్ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల కోరికలను తెలుసుకుంటూ వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్టు మేక్ ఎ విష్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు

No comments:

Post a Comment