Monday 20 October 2014

సచిన్ రికార్డును బద్దలకొట్టిన కోహ్లీ

సచిన్ రికార్డును బద్దలకొట్టిన కోహ్లీ!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. పిన్న వయసులోనే టెస్టు క్రికెట్ ఆడిన క్రికెటర్ గా చరిత్రకెక్కడమే కాకుండా, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు(51) సాధించిన బ్యాట్స్ మెన్ గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే సచిన్ టెస్టు రికార్డుకు పెద్దగా ముప్పులేకపోయినా.. వన్డే రికార్డుపై అనేక సందేహాలు తలెత్తున్నాయి. సచిన్ వన్డే రికార్డును అధిగమించే క్రమంలో మరో భారత్ ఆటగాడు విరాట్ కోహ్లీ తొలి అడుగు వేశాడు.

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ, టెండూల్కర్ రికార్డుల ఛేదనలో తొలి విజయం సాధించాడు. ఆ మ్యాచ్‌లో 127 పరుగులు చేసిన విరాట్, తన కెరీర్‌లో 20 సెంచరీలను పూర్తి చేశాడు.  కేవలం 64 ఇన్నింగ్స్‌లోనే 20 సెంచరీలు చేసిన కోహ్లీ, అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను చేరిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో మొత్తం 49 సెంచరీలు చేసిన సచిన్, తొలి 20 సెంచరీలు చేసేందుకు 197 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. దీంతో కోహ్లీ సచిన్ పేరిట ఉన్న 20 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. అతి తక్కువ సమయంలోనే సచిన్ రికార్దుపై పైచేయి సాధించిన కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక రికార్డులు నమోదు చేస్తాడా?లేదా అనేది వేచి చూడాల్సిందే

No comments:

Post a Comment