Thursday 9 October 2014

మహారాష్ట్రలో బీజేపీకే అధికారం : ప్రీ పోల్ సర్వేల జోస్యం

maharashtra pollమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరాఠా ఓటర్లు పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రీ పోల్ సర్వేల్లో తేలింది. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను చూడాలని వారంతా భావించడం గమనార్హం. 
 
మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 15వ తేదీ పోలింగ్ జరుగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొనివుంది. చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసే బీజేపీకి 154 స్థానాలు దక్కించుకుంటుందని, 47 సీట్లతో శివసేన రెండో స్థానంలో ఉంటుందని ది వీక్, హన్సా రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. 
 
కేంద్రంలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ శివసేనతో బంధం తెంచుకొని, చిన్న పార్టీలతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే శివసేనతో పొత్తు లేకపోయినప్పటికీ మహారాష్ట్ర విధానసభలో బీజేపీ, దాని మిత్రపక్షాలు స్పష్టమైన ఆధిక్యత సంపాదిస్తాయని ఈ సర్వే వెల్లడించింది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో మాత్రం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేనే అగ్ర భాగాన నిలిచారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ఉద్ధవ్ థాక్రేనే ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం గమనార్హం. 

No comments:

Post a Comment