Wednesday 8 October 2014

ఎర్రబెల్లిని కారు ఎక్కనివ్వం.. కడియం...



తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్‌లోకి వెళ్ళబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఎర్రబెల్లి ఎప్పటికప్పుడు ఆ వార్తల్ని ఖండిస్తున్నారు. ఎర్రబెల్లి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా లేదా అనే విషయాన్ని అలా వుంచితే, ఆయన్ని మాత్రం టీఆర్ఎస్‌లోకి రానిచ్చేదే లేదని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి కంకణం కట్టుకున్నట్టున్నారు. ఆ విషయాన్నే ఆయన చెబుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావును తెలంగాణ రాష్ట్ర సమితిలోకి రానివ్వబోమని కడియం శ్రీహరి స్పష్టంగా చెబుతున్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తూ అర్ధరాత్రి వేళల్లో కేసీఆర్ ఇంటిచుట్టూ ఎందుకు తిరుగుతున్నావని దయాకర్‌ని కడియం  శ్రీహరి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళబోనని చెబుతున్న ఎర్రబెల్లి ఆ మాటకు కట్టుబడి వుండాలని ఎంపీ కడియం శ్రీహరి సవాల్ విసిరారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏ గడ్డిపీకినా టీఆర్‌ఎస్‌లోకి రానివ్వబోమని ఎంపీ కడియం స్పష్టంగా చెప్పేశారు. 

No comments:

Post a Comment