Tuesday 7 October 2014

కడప హత్యల మిస్టరీ: భార్యకు వేరొకరితో.

కడప: కడపలో ఓ దారుణం ఆలస్యంగా వెలుగు చూసిన విషయం తెలిసిందే. కడపలోని నబీకోటలో బియోన్ ఇంగ్లీష్ పాఠశాల నిర్వహిస్తున్న కృపాకర్.. భార్య, ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంచనల సంఘటన వివరాలను జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ మంగళవారం రాత్రి విలేకరులకు వెల్లడించారు. ఓ కుటుంబం అదృశ్యమమై ఏడాది దాటినా వారి జాడ లేకపోగా, వారు హత్యకు గురై ఉంటారని భావిస్తున్న తరుణంలో చివరకు అదే నిజమైంది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా పూర్తి వివరాలు తెలిశాయని తెలుస్తోంది. మంగళవారం అశ్తిపంజరాలను వెలికి తీశారు. కడపలో జియోన్ విద్యా సంస్థల అధినేత, జిల్లా శాంతి సంఘం వ్యవస్థాపక కార్యదర్శి రాజారత్నం రెండో కుమారుడు కృపాకర్. పదేళ్ల కిందట మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తండ్రి కుటుంబంతో కలిసి కృపాకర్ కుటుంబం కూడా జియోన్ పాఠశాల ఆవరణలోని ఇంట్లోనే ఉంటోంది. కొంతకాలంకా కృపాకర్, భార్య మౌనిక మధ్య గొడవలు జరిగాయి. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో కృపాకర్ ఉండేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఫిబ్రవరి 22న మౌనికను చీరతో ఉరివేసి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని తన వద్ద నమ్మకంగా పని చేసే డ్రైవర్ సహాయంతో పాఠశాల ఆవరణలోనే పూడ్చి పెట్టారు.

No comments:

Post a Comment