Saturday 18 October 2014

తీరనున్న కష్టాలు: తెలంగాణకు వెయ్యి మెవా విద్యుత్

తీరనున్న కష్టాలు: తెలంగాణకు వెయ్యి మెవా విద్యుత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీర్చేందుకు మార్గం సుగమమైంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా ఒప్పందం కుదిరితే తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ రానుంది. ప్రస్తుతం రాజధాని హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. నగరంలో 2గంటల నుంచి 4గంటలపాటు విద్యుత్ కోతను విధిస్తున్నారు. అది గ్రామాల్లో అయితే దాదాపు 6నుంచి 8గంటలవరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. బహిరంగ మార్కెట్లలో 7నుంచి 8రూపాయల చొప్పున కరెంటు కొంటున్నా.. అది ఏమాత్రం సరిపోవట్లేదు. ఈ నేపథ్యంలో గతంలో ఛత్తీస్‌గఢ్‌తో మొదలైన చర్చలను పునరుద్ధరించింది. కాగా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా విద్యుత్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అయితే ప్రస్తుతానికి విద్యుత్ సరఫరా లైన్ లేకపోవడం ఓ సమస్యగా మారింది. వీలైనంత త్వరగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుని, కారిడార్ నిర్మించుకోవడం, లేదా మరేదైనా మార్గం ద్వారా విద్యుత్తును తీసుకురావడం చేయాలని భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందితే తెలంగాణలో దాదాపు విద్యుత్ కష్టాలు తీరినట్లే అవుతుంది. గోదావరి పుష్కరాలపై కమిటీ ఏర్పాటు గోదావరి పుష్కరాలపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా నీటిపారుదల ఈఎస్‌సి, ఎస్ఆర్ఎస్‌సి చీఫ్ ఇంజినీర్, గోదావరి ఎత్తిపోతల చీఫ్ ఇంజినీర్, బేసిన్ కమిషనర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా చీఫ్ ఇంజినీర్లను నియమించింది.

No comments:

Post a Comment