Friday 17 October 2014

ఆళ్లగడ్డ: శోభ కూతురు అఖిలప్రియ నామినేషన్

కర్నూలు: ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత మాజీ పమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియ శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డ తహసీల్డార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె వెంట తండ్రి భూమా నాగిరెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ పన్నికల్లో ప్రచారం ముగుస్తుండగా శోభా నాగిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించినప్పటికీ ఎన్నికల్లో గెలిచినట్లు అధికారులు ప్రకటించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, తొలి నుంచి తనకు బిజినెస్ అంటే ఇష్టమని, ఆ దిశగానే తన తల్లిదండ్రులు కూడా తనను ప్రోత్సహించారని ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ కొద్ది రోజుల క్రితం.. తనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో చెప్పారు. అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో మునిగి తేలుతుండే వారని, వారిని తాము దగ్గర నుంచి పరిశీలించేవారమని చెప్పారు. అయితే, రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉండేవారమన్నారు. అమ్మలేని లోటు తీర్చలేనిదన్నారు. అమ్మ ఉన్నప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి ఎన్నడూ ప్రస్తావన రాలేదన్నారు. అమ్మ స్థానంలో పోటీ చేయాల్సి వస్తుందని తాను ఊహించలేదన్నారు. నాన్న సహకారంతో పేదలకు మేలు చేయాలనే అమ్మ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎవరైనా మృతి చెందితే, వారి స్థానంలో కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పోటీ పెట్టవద్దనే సంప్రదాయం మన దగ్గర ఉంది. ఇటీవల కృష్ణా జిల్లాలో తండ్రి చనిపోతే, టీడీపీ తరఫున తంగిరాల సౌమ్య పోటీ చేశారు. అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీకి పెట్టలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే సంప్రదాయం పాటిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అవకాశముంది. టీడీపీ పోటీ చేయకపోవచ్చునని చెబుతున్నారు. కానీ, స్థానిక నేతల నుండి మాత్రం ఒత్తిడి ఉంది. ఎన్నికల షెడ్యూల్ నామినేషన్లు - సెప్టెంబర్ 14 - 21 వరకు పరిశీలన - సెప్టెంబర్ 22న ఉపసంహరణ - సెప్టెంబర్ 24న పోలింగ్ - నవంబర్ 8న ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న
ఆళ్లగడ్డ: శోభ కూతురు అఖిలప్రియ నామినేషన్

No comments:

Post a Comment