Monday 20 October 2014

కాశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరుచేస్తాం : బిలావల్ భుట్టో

కాశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేసి తీరుతామని పాక్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో కొడుకు, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) యువ నేత బిలావల్‌ భుట్టో ప్రకటించారు. ఆరు నూరైనా భారత్‌ నుంచి కాశ్మీర్‌ను సాధించి తీరతానని మహ్మద్‌ ఆలీ జిన్నా సమాధి దగ్గర జరిగిన ఒక ర్యాలీలో శపథం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తినపుడల్లా భారతదేశమంతా గగ్గోలు పెడుతుంది. ఒక భుట్టో మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలో వారికి తెలియదు. అందుకే ఆ గగ్గోలు’ అని వ్యాఖ్యానించారు. 
 
కాశ్మీర్‌పై తన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. కాశ్మీర్‌ ముమ్మాటికీ పాకిస్థాన్‌లో భాగమవుతుందంటూనే కాశ్మీర్‌ పేరుతో భారత్ - పాక్‌ చర్చలను బందీగా చేసేందుకు ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment