Thursday 16 October 2014

రుఘురాం రాజన్‌కు బ్యాంకులపై యనమల - కేసీఆర్ ఫిర్యాదు!

raghuram rajanఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌కు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు బ్యాంకులపై ఫిర్యాదు చేశారు. కొత్త రుణాలు మంజూరుకు బ్యాంకర్లు ఏమాత్రం సహకరించడం లేదని వారు తమతమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 
 
బుధవారం హైదరాబాద్‌‍కు రాజన్ రాగా, ఆయనతో వీరిద్దరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదని  మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ సుజనా చౌదరిలు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత రాజన్ టీ సీఎం కేసీఆర్‌తో కూడా సమావేశమయ్యారు. ‘రుణ మాఫీ’ పొందిన రైతులకు కొత్త రుణాల మంజూరులో బ్యాంకులు ఆశించిన మేరకు సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌కు  ఫిర్యాదు చేశారు. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న విషయాన్ని రాజన్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు. 
 
ఆర్‌బీఐ పరిధిని మరింత విస్తృతపరిచే అంశాన్ని పరిశీలిస్తున్నామని, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం రుణ వితరణతో పాటు మరింత సహకారం అందించడానికి కృషి చేస్తామని రాజన్ వెల్లడించారు. ఆర్‌బీఐ త్వరలో చిన్న బ్యాంకులకు అనుమతులు ఇవ్వనుందని..ఆ బ్యాంకులు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఎక్కువ రుణాలిచ్చేలా చూస్తామని వివరించారు. 

No comments:

Post a Comment