Tuesday 28 October 2014

ఖైదీ భార్యను వేధిస్తున్న వార్డర్.. కేసు నమోదు

ఖైదీ భార్యను వేధిస్తున్న వార్డర్.. కేసు నమోదు
హైదరాబాద్: మహిళల పట్ల వేధింపులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. చర్లపల్లి జైలు వార్డర్ తన భార్యకు తరుచు ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం రాములు అనే ఖైదీ చర్లపల్లి జైళ్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని చూసేందుకు అతడి భార్య తరుచూ జైలుకు వచ్చేది. ఆ క్రమంలో జైలు వార్డర్ వెంకన్న ఆమె నుంచి సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి తరచూ శిక్షను అనుభవిస్తున్న ఖైదీ రాములు భార్యకు ఫోన్ చేసి వేధించేవాడని తెలిపారు. వార్డర్ వేధిస్తున్న విషయాన్ని తన భర్త రాములుకు తెలిపింది అతని భార్య. దీంతో రంగంలోకి దిగిన రాములు జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించక పోగా.. రాములు భార్యపై వేధింపులు మరింతగా పెరిగాయి. ఆ విషయాన్ని రాములకు వెల్లడించగా.. రాములు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాలో వార్తా కథనాలు ప్రసారం అయ్యాయి

No comments:

Post a Comment