Friday 17 October 2014

నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతం

బాలాసోర్, అక్టోబర్ 17: ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్భయ్‌ను రూపొందించారు. ఈ క్షిపణి 850 కిలోమీటర్ల లక్ష్యాన్ని అవలీలంగా ఛేదించగలదు. శుక్రవారం ఉదయం 10.04 గంటలకు నిర్భయ క్షిపణిని డెఫెన్స్ రీసెర్జి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డిఆర్‌డిఓ) విజయవంతంగా పరీక్షించింది. క్షిపణుల దాడిని తప్పించుకుని లక్ష్యాన్ని చేరుకోవడం నిర్భయ్ ప్రత్యేకత అని డిఆర్‌డిఓ శాస్తవ్రేత్తలు ప్రకటించారు. చాందీపూర్ వేదిక నుంని 2013 మార్చి 12న మొట్టమొదటి సారి ఇలాంటి ఈ తరహా క్షిపణినే పరీక్షించారు. అయితే అనుకోని అవాంతరాల వల్ల అది మధ్యలోనే విఫలమైంది. ఇంతకు ముందు భారత్, రష్యా సంయుక్తంగా 290 కిలోమీటర్ల శ్రేణిగల సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్‌ను అభివృద్ధి చేసింది. అయితే దానికన్నా ఎక్కువ సామర్ధ్యంగల లాంగ్ రేంజ్ కేపబుల్ మిసైల్ నిర్భయ్‌ను ఎయిరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(ఎడిఇ), డిఫెన్స్ రీసెర్చి, డెవలప్‌మెంట్(డిఆర్‌డిఓ)ను రూపొందించాయి.

No comments:

Post a Comment